ఫలించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కృషి

విధాత‌: జిల్లాలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర అ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.ముద్దనూరు నుంచి పులివెందుల, కదిరి, గోరంట్ల మీదుగా కోడికొండ చెక్పోస్ట్ వరకు ఉన్న రహదారి ముద్దనూరు(Nh -716,), కదిరి(Nh-42), గుమ్మయ్యవారిపల్లె(Nh-342), పాలసముద్రం క్రాస్ (Nh-44),హిందూపూర్ (Nh544) మీదుగా వెళుతుంది.155 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి ఒకవైపు […]

  • Publish Date - September 8, 2021 / 04:38 PM IST

విధాత‌: జిల్లాలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర అ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
ముద్దనూరు నుంచి పులివెందుల, కదిరి, గోరంట్ల మీదుగా కోడికొండ చెక్పోస్ట్ వరకు ఉన్న రహదారి ముద్దనూరు(Nh -716,), కదిరి(Nh-42), గుమ్మయ్యవారిపల్లె(Nh-342), పాలసముద్రం క్రాస్ (Nh-44),హిందూపూర్ (Nh544) మీదుగా వెళుతుంది.155 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి ఒకవైపు బెంగళూరుకు మరోవైపు హైదరాబాద్కు వెళుతుంది. ఈ రహదారి వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రజలకు అటు పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే నంద్యాల జమ్మలమడుగు రహదారి Nh-44 (కర్నూలు- రాణి పేట ), Nh67(హుబ్లీ- కృష్ణపట్నం) జాతీయ రహదారుల మీదుగా కొనసాగుతూ నంద్యాల కోయిలకుంట్ల, నొస్సం, జమ్మలమడుగు పట్టణాలను కలుపుతుంది. 80 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి పులివెందుల, కదిరి, గోరంట్ల మీదుగా బెంగళూరు వెళుతుంది. ఈ రెండు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి దోహదపడు పొందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగస్టు 10వ తేదీన జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అర్మాన్ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు . ఈ మేరకు పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించారు స్పందించిన కెంద్ర ప్రభుత్వం పైన తెలిపిన ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కృషిని ఈ ప్రాంత వాసులు కొనియాడుతున్నారు.

Latest News