Site icon vidhaatha

కింగ్ కోబ్రా కలకలం .. భయాందోళనలో రైతులు

విధాత:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలము చింతలూరు సరుగుడు తోట్లలో కింగ్ కోబ్రా సంచరించడం తో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కోబ్రా సరుగుడు తోటలలో కన్పించడం,మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తుంటే భయం వేస్తోందని రైతులు అంటున్నారు.చింతలూరు గ్రామానికి చెందిన బొడ్డు లోవరాజు,సూరిబాబుల పొలాల్లో ఇది అధికంగా సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.అటవీ శాఖ అధికారులు దీన్ని పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలి అని రైతులు కోరుతున్నారు.

Exit mobile version