Site icon vidhaatha

50 పడకలకోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రి నందు 50 పడకలతో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ….

అవనిగడ్డ నియోజకవర్గం లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రజలకు అందుబాటులో ఉండేలా గా అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిని నందు ఈరోజు 50 పడకలతో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఇందుకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం

స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు చొరవతో ఇక్కడ covid సెంటర్ను ఏర్పాటు చేయటమే కాక అదనపు సిబ్బందిని కూడా తీసుకోవడం జరిగింది.అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు

కరోనా నిర్ధారణ అయ్యేందుకు ట్రూ నాట్ టెస్టులను కూడా అందుబాటులో ఉంచాం.

అవనిగడ్డ ఆసుపత్రికి నోడల్ ఆఫీసర్ గా R&B D.E వరలక్ష్మి బాధ్యతలు నిర్వహిస్తారు.

ప్రజలందరూ కూడా కరోనా ను అరికట్టే విధంగా మాస్కులు ధరించి అవసరమైతే తప్ప అనవసర సమయంలో బయటకు రాకుండా స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించవలసి నదిగా కోరుతున్నాం. అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ దొర, అవనిగడ్డ డిఎస్పి మహబూబ్ బాషా, అవనిగడ్డ తాసిల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version