Site icon vidhaatha

నా భూమి నాకు ఇప్పించండి

విధాత‌: నా భూమిలో.. చనిపోయిన వాళ్ల పేర్లు చేర్చి అక్రమంగా భూమిని ఆక్రమణ చేశారు.కర్నూల్ జిల్లా వెలుగోడు తహశీల్దార్, వీఆర్వో, అధికారులు వేరే వాళ్లతో కుమ్మక్కయి .. చనిపోయిన వారి పేర్లు ఎక్కించి నాకు అన్యాయం చేశారంటూ ఇవాళ విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న సీసీఎల్ఏ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, సెక్రటరీ చక్రవర్తిలను కలసి వినతి పత్రం అందజేసిన కర్నూలు జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామానికి చెందిన రైతు హుస్సేన్ మియా.

తన భూమిని అధికారులు వేరే వాళ్లతో కుమ్మక్కయి అన్యాయం చేశారని.. మీరైనా సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని నీరబ్ కుమార్ ప్రసాద్, చక్రవర్తిలను కలసి గోడు వెళ్లబోసుకున్న పేద రైతు హుస్సేన్ మియా.ఇది పేదల ప్రభుత్వమని, తప్పకుండా న్యాయం చేస్తామని హుస్సేన్ మియ్యాకు హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు.

Exit mobile version