Site icon vidhaatha

Leopard | తిరుమలతో మరోసారి చిరుతల కలకలం

అలిపిరి ఆఖరి మెట్టు వద్ద రెండు చిరుతల సంచారం

విధాత : తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత పులులు మరోసారి కలకలం రేపాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్టు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. వాటిని చూసిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో అవి అడవిలోకి పారిపోయాయి. చిరుతలు కనిపించిన ప్రదేశాన్ని టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్టు అధికారులు పరిశీలించారు.

చిరుతల జాడలను గుర్తించేందుకు ఫారెస్టు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నడక మార్గంలో భక్తులను టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నారు. అక్షిత అనే బాలికను చిరుత హతమార్చాక మూడు చిరుతలను ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నప్పటికి తరుచు మళ్లీ తిరుమల దారుల్లో చిరుతల సంచారం భక్తులను భయపెడుతునే ఉంది.

Exit mobile version