Site icon vidhaatha

10 లక్షలమందికి ఫోన్‌లో వైద్యసేవలు

విధాత,విజయవాడ:కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌సెంటర్‌ బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది. 2021 మే 1వ తేదీనుంచి 104 కాల్‌సెంటర్‌లో రిజిస్టర్‌ అయిన 5,523 మంది వైద్యులు ఇప్పటివరకు 10 లక్షలమంది బాధితులకు ఫోన్‌లో వైద్యసలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ వైద్యుల్లో 1,132 మంది స్పెషలిస్టులు.
వీళ్లు టెలీ కన్సల్టేషన్‌ కింద ఈనెల 21వ తేదీ నాటికి 10,16,760 మందికి వైద్యసేవలు అందించారు. సేవలు పొందిన వారిలో 7.20 లక్షల మంది ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారే ఉన్నారు. కోవిడ్‌ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులున్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోను చేయని విధంగా ఏపీలో మాత్రమే 104 కాల్‌సెంటర్‌ నుంచి టెలీకన్సల్టెన్సీ ద్వారా వైద్యులు సేవలు అందించారు.

Exit mobile version