అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక మరణాలు కధనంపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని…
అనంతపురం జిల్లా DMHO డాక్టర్ కామేశ్వర ప్రసాద్, DCHS డాక్టర్ రమేష్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని…
హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 8మంది మరణాలు పూర్తిగా అవాస్తవం…
ఈరోజు ఉదయం 8గంటల లోపు సెలెండర్స్ ద్వారా ఆక్సిజన్ అందుతున్న సమయంలో 8మంది మరణించారని మంత్రి ఆళ్ల నానికి ఫోన్ లో తెలిపిన హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్…
ఈ 8మంది కరోనా బాధితులు తీవ్ర అనారోగ్యంతో ఆదివారం రాత్రి హిందూపూర్ హాస్పిటల్ కి వచ్చినట్టు మంత్రి ఆళ్ల నానికి ఫోన్ లో వివరించిన సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్…
అందుబాటులో 6టన్నులు ఆక్సిజన్ ఉంది…
ఈరోజు ఉదయం 6గంటలకు అయిపోగానే వెంటనే 8మంది పెషేంట్స్ కు సెలెండర్స్ వినియోగించినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్ వెల్లడి…
కరోనా బాధితులకు సిలెండర్ వినియోగిస్తున్న సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ ఈరోజు ఉదయం హాస్పిటల్ కి వచ్చినట్టు మంత్రి ఆళ్ల నానికి తెలిపిన సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్…
ప్రస్తుతం హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో 225బెడ్స్ కరోనా పెషేంట్స్ కు అందుబాటులో ఉంచాం…
అదనంగా మరో 20బెడ్స్ కూడ రెడీగా ఉంచమన్నా మంత్రి ఆళ్ల నాని…
ఎప్పటికప్పుడు అనంతపురం DCHS డాక్టర్ రమేష్, హిందూపూర్ నోడల్ ఆఫీసర్, డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాజేందర్ ప్రసాద్ పర్యవేక్షణ చేస్తున్నారు…
కోవిడ్ తో హాస్పిటల్ కు వస్తున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టంగా అదేశాలు ఇచ్చిన మంత్రి ఆళ్ల నాని…
అనంతపురం జిల్లాలో అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో వైద్య బృందం అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు…
నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఏపి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు…
హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు…