Site icon vidhaatha

మున్సిపల్ స్టేడియంను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ

విధాత: నగరంలోని పటమట ప్రాంతంలో చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ స్టేడియంను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ ,నగర మేయర్ భాగ్యలక్ష్మి,ఇతర అధికారులు.

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్

రూ.8.91 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో మున్సిపల్ స్టేడియం నిర్మించాం.నగరంలో ఉన్న అందరికీ మెంబర్షీప్ కల్పిస్తున్నాం.ఆటల్లో ఉత్సాహం ఉన్న వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.విజయవాడ నగరం సుందరంగా, కాలుష్య రహితంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 600 కోట్ల రూపాయలని విజయవాడ అభివృద్ధికి కేటాయించారు.చంద్రబాబు హయాంలో విజయవాడలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు.చంద్రబాబు అమరావతి పేరుతో విజయవాడ నగర అభివృద్ధిని గాలికి వదిలేశారు.రానున్న రోజుల్లో నగరంలో మరిన్ని ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.

Exit mobile version