Site icon vidhaatha

తెలంగాణ వైఖ‌రిపై ప్రధాని మోదీకి జగన్‌ లేఖ

విధాత,అమరావతి : తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయ‌న లేఖ రాశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ఆ లేఖలో.. ‘‘ తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా… జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి.

శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోంది. కేఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది’’ అని పేర్కొన్నారు.

Exit mobile version