Site icon vidhaatha

అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి

విధాత‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళిత పక్షపాతి అని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. దళితులు ఉన్నత చదువులు చదవాలని ప్రత్యేక పథకాలు తెచ్చారన్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా?. రోజుకు ఒకసారి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతున్నారు. విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని’’ ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు.

Exit mobile version