విధాత:ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించినా అంచనా వ్యయాలను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పోలవరంపై నోటీస్‌ను సమర్పించారు.2017–18ధరల ప్రకారం రూ.55,656.87కోట్లు నిర్మాణానికి అయ్యే వ్యయమని సీడబ్ల్యూసీ ఖరారు చేసిందని, 29నెలలు అయినా ఇప్పటికీ ఈ అంచనాలను సవరించలేదని.. దీనికి ఆమోద ముద్ర వేయాలని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో నోటీస్‌ను అందించారు.