Site icon vidhaatha

ఇంత తక్కువ ఫీజులతో పాఠశాలల నిర్వహణ సాధ్యమేనా

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను తగ్గించడం మంచిదే అయినా.. ఈ రకమైన ఫీజులతో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ సాధ్యమేనా? అని ప్రశ్నించారు. రూ.18 వేలతో కళాశాల విద్యార్థికి ఏడాది పాటు విద్యతో పాటు హాస్టల్‌ సౌకర్యం కల్పించగలరా అని నిలదీశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక దశలో పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు.

Exit mobile version