Site icon vidhaatha

ఆంధ్రప్రదేశ్ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై విచారణ

విధాత:ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధమని డాక్టర్ శైలజ పిటిషన్ వేశారు.దీనిపై విచారణ జరిగింది.సుప్రీం కోర్టు తీర్పును అర్థం చేసుకోకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రసాద్ బాబు వాదించారు.

ఎన్నికల షెడ్యూల్‌కు నెల రోజుల సమయం ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టంగా నిర్దేశించిందన్నారు.ఆ తీర్పును అర్ధం చేసుకోకుండా రాష్ట్రంలో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం వలన రూ. 160 కోట్లు ప్రజా ధనం వృధా అయిందని.. దీన్ని ఎవరి నుంచి రాబట్టాలని ప్రశ్నించారు.

వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Exit mobile version