నిర్లక్ష్యం ఖరీదు.. నిండు గర్భిణి ప్రాణం

రంపచోడవరం, మారేడుమిల్లి: సకాలంలో వైద్యసేవలు అందక నిండు గర్భిణి ఆదివారం మృతి చెందారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి వివరాల ప్రకారం.. మారేడుమిల్లి మండలం పూజారిపాకలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి పూజారి విజయకుమారి(26)కి ఆదివారం ఉదయం పురిటినొప్పులొచ్చాయి. దాంతో భర్త కృష్ణారెడ్డి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, నర్సు సేవలందించారు. పరిస్థితి విషమించడంతో ప్రాంతీయ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ, ఓపీ రాయించుకురావాలని వైద్యసిబ్బంది కాలయాపన […]

  • Publish Date - May 3, 2021 / 07:45 AM IST

రంపచోడవరం, మారేడుమిల్లి: సకాలంలో వైద్యసేవలు అందక నిండు గర్భిణి ఆదివారం మృతి చెందారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

వారి వివరాల ప్రకారం.. మారేడుమిల్లి మండలం పూజారిపాకలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి పూజారి విజయకుమారి(26)కి ఆదివారం ఉదయం పురిటినొప్పులొచ్చాయి. దాంతో భర్త కృష్ణారెడ్డి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు.

వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, నర్సు సేవలందించారు. పరిస్థితి విషమించడంతో ప్రాంతీయ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ, ఓపీ రాయించుకురావాలని వైద్యసిబ్బంది కాలయాపన చేయడంతో ఆసుపత్రి బయటే ఆమె సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆశ వర్కర్ల యూనియన్‌ నేత మట్ల వాణిశ్రీ, సెంటర్‌ఫర్‌ రైట్స్‌ అధ్యక్షుడు బాలు అక్కిస ఆరోపించారు.

Latest News