Site icon vidhaatha

రెమెడిసివర్ ఇంజెక్షన్ ల అక్రమార్కులపై చర్యలేవి?

విధాత:పేద రోగులకు అందాల్సిన ఇంజెక్షన్ లు పక్కదారిపట్టించిన కొంతమంది సర్కారీ వైద్యులు.కర్నూల్ జీజీహెచ్ లో ఈ ఏప్రిల్ లో బయటపడ్డ అక్రమాలు స్వయంగా తన అపార్ట్ మెంట్ లో బ్లాక్ లో ఇంజెక్షన్ లు అమ్ముకున్న ఓ మహిళా వైద్యురాలు. విజిలెన్స్,టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతం.విచారణకు ఆదేశించిన అమరావతి లోని వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం.ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోని అధికారులు.మహిళా వైద్యురాలి అక్రమాలకు జీజీహెచ్ ఉన్నతాధికారుల మద్దతు?విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్న సదరు మహిళా వైద్యురాలు.సుమారు 3 కోట్ల మేర విలువైన ఇంజెక్షన్ లు పక్కదారిపట్టడంలో వైద్యురాలితో పాటు హాస్పిటల్ సిబ్బంది పాత్ర.విచారణ ఎదుర్కొంటున్న వైద్యురాలు రోజువారీ విధులకు హాజరవుతున్న వైనం.పేదలకు అందాల్సిన వైద్యం పక్కదరిపట్టడం పై తీవ్ర విమర్శలు.

Exit mobile version