విధాత:డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనల కోసం మరోసారి గడువు కోరిన ఐఏఎస్ శ్రీలక్ష్మి.దర్యాప్తు పూర్తయినట్లు లిఖితపూర్వకంగా తెలపాలని ఇటీవల సీబీఐని హైకోర్టు ఆదేశిందన్న శ్రీలక్ష్మి.హైకోర్టులో ఈనెల 9న విచారణ ఉన్నందున వారం రోజులు వాయిదా వేయాలని సీబీఐ కోర్టును కోరిన శ్రీలక్ష్మి.విచారణ పూర్తయిందని గతేడాది అక్టోబరులో దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారన్న సీబీఐ కోర్టు.
మరో రూ.3వేలు చెల్లిస్తే వాదనలు వాయిదా వేస్తామని శ్రీలక్ష్మికి తెలిపిన సీబీఐ కోర్టు.గత నెల 29న రూ.వెయ్యి చెల్లించాలని శ్రీలక్ష్మిని ఆదేశించిన సీబీఐ కోర్టు.తదుపరి విచారణలో వాదించకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామన్న సీబీఐ కోర్టు.ఓఎంసీ కేసు విచారణ ఈనెల 12కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.