Site icon vidhaatha

మూడు రోజుల వ్యవధిలో బావ, బావమరిది మృతి

కరోనా కాటుకు మూడు రోజుల వ్యవధిలో బావ, బావమరిది మృతిచెందిన విచారకర సంఘటన రొంపిచర్లలో జరిగింది. గ్రామానికి చెందిన గంగిరెడ్డి సుబ్బారెడ్డి(37) వాటర్‌ప్లాంట్‌ నిర్వహిస్తూ కరోనా బారిన పడ్డాడు. శనివారం రాత్రి నరసరావుపేట పట్టణంలోని ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆయన బావ పడాల సుబ్బారెడ్డి(48) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం జ్వరం రావడంతో ఇంటి వద్దనే చికిత్స పొందారు. జ్వరం తగ్గకపోవడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా వచ్చింది.

నరసరావుపేట పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన బావ, బావమరిది చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Exit mobile version