Site icon vidhaatha

హెలికాప్ట‌ర్ సాయంతో కొనసాగుతున్న‌ స‌హాయ చ‌ర్య‌లు

విధాత‌: ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో అంద్ర‌ప్ర‌దేశ్‌, చెన్నై ప్రాంతాలు అత‌ల‌కుత‌లం అవుతున్నాయి. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. ఇంకా గ్రామాలు, ఇండ్లు న‌డుములోతు నీటిలోనే ఉన్నాయి. చాలామంది ప్ర‌జ‌ల‌ ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. కాగా చెన్నైకొత్తపల్లి మండలం వెల్దుర్తి వంగాపేరులో జేసీబీ లో చిక్కుకున్న 11 మందిని హెలికాప్ట‌ర్ సాయంతో ఎన్డీఆర్ఎప్ సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉండ‌గా కడప జిల్లాలో ఘోర ప్రమాదం సంభ‌వించింది.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-19-at-4.34.35-PM.mp4

భారీ వ‌ర‌ద‌ల ఉధ‌తికి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. వరదలు 12 గ్రామా లను చుట్టుముట్టడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వెంట నే నేవీ అధికారులు రంగంలోకి దిగారు. హెలికాప్టర్ ద్వారా సేవలు కొన‌సాగిస్తున్నారు. ఐతే హస్తవరం రైల్వే ట్రాక్ 10 వేల మంది ని కాపాడ‌గా కడప తిరుపతి రహదారిపై పది మంది గల్లంతయ్యారు.

Exit mobile version