విధాత:అనేక జిల్లాల్లో జనసేన నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.అరెస్టు లను ఖండించిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.ఎంప్లాయి మెంట్ ఎక్చేంజి కార్యాలయం వద్ద కు చేరుకున్న జనసేన పోతిన మహేష్, ఇతర నాయకులు.అనుమతి లేదంటూ కార్యాలయం గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు.అధికారులే బయటకు రావడంతో విజ్ఞాపన పత్రాన్ని అంద చేసిన పోతిన మహేష్.
పోతిన వెంకటమహేష్
ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2.30లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని జగన్ చెప్పడం వాస్తవం కాదా ప్రతి యేడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు.ఇప్పుడు జాబుకు లేని జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటించారు.ఇది అన్యాయం అంటే… అక్రమంగా అరెస్టు చేస్తున్నారు.అధికారులు కూడా వినతి పత్రాలు తీసుకోవాలంటే భయపడుతున్నారు.పోలీసులతో అన్యాయంగా మా వారిని అరెస్టు చేయిస్తున్నారు.పాదయాత్ర లో ముద్దులు కురిపించి…నేడు పోలీసులుతో కొట్టిస్తారా ముప్పై లక్షల మంది జీవితాలను నాశనం చేస్తారా.నిన్న సిఎం నివాసం ముట్టడి తెలుసుకుని జగన్ పోలవరం పారిపోయారు.చంద్రబాబు చెప్పిన సోమవారం పోలవరం ను…జగన్ నిన్న అమలు చేసి చూపారు అంటే… ప్రజలను మోసం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే.నిరుద్యోగులు కల సాకారం చేసే వరకు జనసేన పోరాటం చేస్తుంది.విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు చేసే ఆందోళనకు జనసేన మద్దతు ఉంటుంది.మా నాయకులు పవన్ కళ్యాణ్, మనోహర్ లు నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.
అక్కల గాంధీ
ఓట్లు కోసం నోటికొచ్చినట్లు జగన్ హామీలు ఇచ్చారు.అధికారం లోకి వచ్చాక అందరినీ నట్టేట ముంచారు.జగన్ మోసంతో నిరుద్యోగ యువత రగిలి పోతుంది.అందుకే స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు.వారి ఆగ్రహాన్ని పోలీసులు ను అడ్డం పెట్టి ఆపలేరు.జగన్ ఉద్యోగాలు ను భర్తీ చేసి మాట నిల బెట్టుకోవాలి.
రామకృష్ణ జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు
ఎన్నికల సమయంలో ఒక మాట.. అధికారం లోకి వచ్చాక మరో మాట.మాయ మాటలతో 151సీట్లు తెచ్చుకుని.. ప్రజలను జగన్ మోసం చేశారు.హామీని అమలు చేయమంటే… అక్రమంగా మమ్మలను అరెస్టు చేస్తున్నారు.రెండున్నర లక్షల ఉద్యోగాల ను భర్తీ చేయాలి.