Site icon vidhaatha

ఆదాయం పోగొట్టి..అప్పు మిగిల్చారు.. గుదిబండలా రుషికొండ భవనాల నిర్వహణ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి : రుషికొండ భవనాల నిర్మాణం కోసం రూ.453 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో ఏడాదికి రూ.7 కోట్లు ఆదాయం వచ్చే రిసార్టులను కూల్చేసి ఇప్పుడు కోటిన్నర రూపాయలు కేవలం విద్యుత్ బిల్లులకే వెచ్చించే స్థితికి వైసీపీ నాయకులు తీసుకొచ్చారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ భవనాలను పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, నిర్మాణ ఖర్చు, ప్రస్తుత నిర్వహణ ఖర్చులపైనా అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో రుషికొండ భవనాల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. రుషికొండ భవనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేకపోయినా చేసిన ఖర్చు రూ 453 కోట్లు అని గుర్తుచేశారు. నిరూపయోగంగా మారిన ప్యాలేస్ ను ఆదాయ వనరుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకంటే ముందు భవనాలకు చేయాల్సిన మరమ్మతులు పూర్తి చేసి ఆదాయ వనరుగా ఎలా మార్చాలి అన్న దానిపై ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Exit mobile version