అనంత‌లో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లకు అనుమతులు

రోజూ 700 సిలిండర్ల సరఫరాకు అవకాశం.జిల్లా అవసరాలకే సగభాగం సిలిండర్లు.గతంలోనే రూ.5 కోట్లతో ఆక్సిజన్‌ పైపులైన్‌ పనులుజిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌కు అనుగుణంగా కలెక్టర్‌ చర్యలకు ఉపక్రమించారు. మూతపడిన ఆక్సిజన్‌ ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి సారించి ప్రభుత్వంతో చర్చించారు. వెనువెంటనే అనుమతులను మంజూరు చేయించి ఉత్పత్తికి మార్గం సుగమం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆక్సిజన్‌ నిల్వ ప్లాంటుతో పాటు ఆక్సిజన్‌ సరఫరా పైపులైన్లను ఇదివరకే ఏర్పాటు చేయడంతో స‌ర‌ఫ‌రా సుల‌భ‌మ‌వుతోంది. […]

  • Publish Date - April 27, 2021 / 11:06 AM IST

రోజూ 700 సిలిండర్ల సరఫరాకు అవకాశం.జిల్లా అవసరాలకే సగభాగం సిలిండర్లు.గతంలోనే రూ.5 కోట్లతో ఆక్సిజన్‌ పైపులైన్‌ పనులుజిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌కు అనుగుణంగా కలెక్టర్‌ చర్యలకు ఉపక్రమించారు. మూతపడిన ఆక్సిజన్‌ ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి సారించి ప్రభుత్వంతో చర్చించారు. వెనువెంటనే అనుమతులను మంజూరు చేయించి ఉత్పత్తికి మార్గం సుగమం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆక్సిజన్‌ నిల్వ ప్లాంటుతో పాటు ఆక్సిజన్‌ సరఫరా పైపులైన్లను ఇదివరకే ఏర్పాటు చేయడంతో స‌ర‌ఫ‌రా సుల‌భ‌మ‌వుతోంది. ఈ రెండు ప్లాంట్లలో ప్రతి రోజూ 700 సిలిండర్ల మేర ఆక్సిజన్‌ ఉత్పత్తి కానుంది.
ఏదైనా ప్లాంటులో ఆక్సిజన్‌ ఉత్పత్తి, రవాణా కోసం ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి(ఫారం–25) అవసరం. శింగనమలలోని లైఫ్‌ ఆక్సిజన్‌ ప్లాంటుకు ఈ అనుమతులు లేవు. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌వెంటనే అనుమతులు వచ్చేలా కృషి చేశారు. ప్లాంటులో 300 సిలిండర్ల మేర ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో 150 నుంచి 200 సిలిండర్లు జిల్లా ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది.
ఇక తూముకుంట వద్దనున్న సాయికృష్ణ ఆక్సిజన్‌ గ్యాసెస్‌ కంపెనీ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిల వల్ల ఈ ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ.19 లక్షల విద్యుత్‌ బకాయిలను 18 నెలల పాటు వాయిదా వేయాలని కంపెనీ అభ్యర్థించింది. దీనిపై వెంటనే ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీతో కలెక్టర్‌ మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలే చూశారు. దీంతో రోజుకు 500 సిలిండర్ల మేర ఆక్సిజన్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. జిల్లాలో అర్జాస్‌ స్టీల్‌ కంపెనీ ఉంది. ఇక్కడ సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఈ ఆక్సిజన్‌ నిల్వలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Latest News