తిరుపతి:పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ నేత నారాయణ వినూత్న నిరసన తెలిపారు. తిరుపతిలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.పెట్రోల్ ధరల పెంపుతో తాము పడుతున్న ఇబ్బందులను నారాయణకు ప్రజలు వివరించారు. మోదీ గడ్డం పెరిగినట్లు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై పన్నులు వేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని నారాయణ పేర్కొన్నారు.