విధాత:రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలపై పోలీసుల దౌర్జన్యమా?హత్యకు గురైన దళిత విధ్యార్ధిని రమ్యకు రూ. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి.సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవండంలో జగన్ ప్రతాపం చూపించాలి.
స్వాతంత్ర దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన దళిత విధ్యార్దిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలు నక్కా ఆనంద్ బాబు,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,దూళిపాళ్ల నరేంద్ర గార్లపై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉన్నది.పరామర్శకు వెళ్లిన లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ నరేంద్ర లపై అమానుషంగా వ్యవహరించడం సరికాదు.పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్యగావించబడుతుంటే దిశ యాప్ ఏం చేస్తుంది? సిసి కెమెరాలు ఏమయ్యాయి? గుంటూరు నడిబొడ్డునే సిసి కెమేరాలు పనిచేయలేదంటే జగన్ రెడ్డికి మహిళల రక్షణ పై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమౌతుంది. టిడిపి నాయకులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
- నారా చంద్రబాబు నాయుడు