విద్యార్థుల సంఘం 19 న తలపెట్టిన ‘చలో ముట్టడి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదు గుంటూరు అర్బన్ ఎస్పీ
విధాత:ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ హైకోర్టు రాజభవన్ సెక్రటరియేట్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం మరియు తదితర ముఖ్యమైన కార్యాలములు ముట్టడించడం లాంటివి చట్టరీత్యా నేరం.ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు మరియు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి ఆందోళనలు మరియు నిరసన కార్యక్రమములు చేపట్టరాదని సదరు నిబంధనలు అతిక్రమించి ఏ విధమైన ఆందోళనలు నిరసనలు చేపట్టినచో అట్టి వారిపై చర్యలు తీసుకబడునని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలియజేసినారు.