● ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను పెంపు, చెత్త పన్ను కు నిరసనగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సిపిఎం,సిపిఐ కార్యకర్తలను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టులు చేసి ఆందోళన అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
● సిపిఎం నేతలు సిహెచ్ బాబూరావు,డి.కాశీనాథ్ బి.రమణ రావు, జి.ఆదిలక్ష్మి, సూరిబాబు కృష్ణ, ch. శ్రీనివాస్,సీపీఐ నేత డి.శంకర్ తదితరులను అరెస్టు చేసి కృష్ణలంక, గవర్నర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.
● రాత్రి నుండి పలువురు నేతలను గృహనిర్బంధం చేస్తూ నోటీసులు జారీ చేసి ధర్నాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పటికీ నిర్బంధాన్ని ఎదుర్కొని వామపక్షాలు ఆందోళన విజయవంతం చేశాయి.
● కౌన్సిల్లో చెత్త పన్ను ను ఆమోదిస్తే ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.
● అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు.
● ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.