వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది.
విధాత:గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండు సమర్పణకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది.రాజద్రోహం కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు మే 21న బెయిలు మంజూరు చేసింది.ఆ సమయంలో గుంటూరు కోర్టులో రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండు పది రోజుల్లో సమర్పించాలని రఘురామను ఆదేశించింది.నిర్ణీత సమయంలోనే తాను వ్యక్తిగత బాండు సమర్పించినా బాండు ట్రయల్ కోర్టులో అదృశ్యమైందని, మరోసారి సమర్పణకు ప్రయత్నించగా సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని గుంటూరు కోర్టు ఆదేశించిందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను సోమవారం విచారించింది. రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి మేరకు వ్యక్తిగత బాండు సమర్పణకు గడువును పొడిగించింది.పిటిషన్ విచారణను ముగించింది.