Site icon vidhaatha

ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైంది: రఘురామ

ఏపీ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రపతికి ఎంపీ లేఖ
విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొందని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ఆర్టికల్‌ 360 ద్వారా ఏపీలో ఆర్థిక అత్యయిక స్థితి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఏపీ రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రాష్ట్ర ఆర్థిక లోటు డిసెంబర్‌ నాటికే రూ.68,536 కోట్లు దాటింది. ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా ప్రభుత్వానికి గగనమైపోతోంది. జులైలో రెండో వారం వరకూ కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు.

Exit mobile version