Site icon vidhaatha

అశోక్‌గజపతిరాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంచయిత

విధాత‌: కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజుపై మాన్సాస్‌ మాజీ చైర్ పర్సన్ సంచయిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను సంచయిత సూటిగా ప్రశ్నించారు. ‘‘గజపతి అశోక్‌ బాబాయ్‌ గారూ… మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్‌ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. ఆయన రక్షణకోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడ్డం లేదా? సిబ్బందిని తప్పుదోవ పట్టించి, వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్‌ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు మాన్సాస్‌ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం మాన్సాస్‌ ట్రస్టు ఉద్యోగులకు జీతాలకు ఈవో వెంకటేశ్వరరావు చెక్‌ పెట్టారు. ట్రస్ట్‌ చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఆదేశాల మేరకు జీతాల చెల్లింపునకు కరస్పాండెంట్‌ ప్రొఫెసర్‌ కేవీఎల్‌ రాజు చెక్కులు విడుదల చేసినా.. బ్యాంకుల వద్ద చెల్లుబాటుకాకుండా ఈవో శనివారం డిపాజిట్లపై ఫ్రీజింగ్‌ విధించారు. దీంతో జీతాలు వస్తాయని అప్పటివరకూ ఎదురుచూసిన 14 విద్యాసంస్థల ఉద్యోగులు, సిబ్బంది నీరుగారిపోయారు. తీవ్ర ఆగ్రహంతో మధ్యాహ్నం కోటలోని మాన్సాస్‌ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.

Exit mobile version