Site icon vidhaatha

నీతి ఆయోగ్‌ సీఈవోకు నిరసన సెగ

విధాత,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ బస చేసిన హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ నిరసన చేపట్టారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్‌టెక్ జోన్‌లో పర్యటించినప్పుడు ఆయన బస చేస్తారు.‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’ అంటూనినదించారు. నీతిఆయోగ్‌ సీఈవో గో బ్యాక్‌ అనే నినాదాలతో హోరెత్తించారు.

Exit mobile version