Site icon vidhaatha

కబ్జాకు గురైన SRR కలశాల స్థలాన్ని కళాశాలకు అప్పగించాలి

విధాత‌: కబ్జాదారుల చేతిలో ఆక్రమణకు గురైన 6.67 ఏకరాల స్థలాన్ని కళాశాలకు అప్పగించాలని విజయవాడ సెంట్రల్ MLA మల్లాది విష్ణుకి విన‌తీ ప‌త్రం అంద‌జేశారు SFI నాయ‌కులు.

అనేక దాశబ్దలుగా ఆక్రమణకు గురవుతున్న SRR కళాశాల స్థలం కోసం విద్యార్థులుగా,పుర్వ విద్యార్ధులుగా, SFI నాయకులుగా అనేక రకాల పోరాటాలు చేసిన ఫలితం లేకుండా పోయిందని, కబ్జా చేసుకునేవాళ్ళు చేసుకుంటూనే వున్నారు, అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వాధికారులు దృష్టికి,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. అవకాశాన్ని చూసుకొని కబ్జా చేసేవాళ్ళు కబ్జా చేస్తూనే వున్నారు 2018 లో విద్యార్థుల్ని కలుపుకొని పెద్దఎత్తున ఆందోళనలు చెయ్యడంతో వెనక్కి తగ్గారు. మళ్లీ లాక్ డౌన్ సందర్భంలో కబ్జా చెయ్యడానికి చూస్తున్నారని MLA దృష్టికి తీసుకొచ్చారు SFI నాయ‌కులు.

అలాగే ఒకసారి కళాశాలను విజిటిట్ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని కోరారు.. దానికి తోడుగా విద్యార్థులు నడవడానికి దారి స‌రిగ్గా లేద‌ని, వర్షం వస్తె నీటితో నిండిపోయి బుర‌ద మ‌యంగా ఉంటుందని తెలియచేశారు.

MLA మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ విషయం నా దృష్టికి వచ్చిందని కచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో SFI నాయ‌కులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version