Site icon vidhaatha

ఫిర్యాదు చూసి చలించి తక్షణ సహాయం అందించిన.. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

విధాత:బంధువులు అందరూ ఉండి కష్ట సమయంలో పలకరించడానికి దరికి ఎవరు రాకపోతే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు సేవ చేసే వారే కరువైతే దినదినగండంగా జీవించాల్సిన పరిస్థితి నేటి సమాజంలో చూస్తున్నం.గొడుగు పేట కు చెందిన దీప్తి అనే మహిళ గత కొంత కాలంగా వెన్నెముక,మెదడుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ పలకరించేవారు లేక వైద్య సహాయం అందించే వారు లేక జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ సహాయం చేయమని ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదు చూసి మానవత్వ హృదయంతో చలించిన జిల్లా ఎస్పీ,మహిళా సమస్య కావడంతో తక్షణమే మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రాజీవ్ కుమార్ కు ఆ ఫిర్యాదును బదిలీ చేసి ఆమెకు చేతనైన సహాయం అందించాలని తెలియజేశారు. వెంటనే దిశా డిఎస్పీ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయినా ఎస్ఐ ఎండి మస్తాన్ ఖాన్ ను , మహిళ హెడ్ కానిస్టేబుల్ స్వాతిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపి,అక్కడ గల రైట్స్ రిహాన్ ఆర్గనైజేషన్ ద్వారా ఆమెకు కావలసినవి సమకూర్చి,మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించవలసిన ఉండగా, ప్రయాణ ఖర్చులు నిమిత్తం నగదు అందజేసి ఇతర సదుపాయాలను కల్పించారు.

Exit mobile version