Site icon vidhaatha

మోట్ల పెద్ద వంక లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు

విధాత:మోట్ల పెద్ద వంక లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాం.మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తూ ఉండడంతో నలికిరి సెల నుండి మోట్ల పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోంది.ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదు.మోట్ల పెద్ద వంక అవతల చిక్కుకున్న వారికి ఆహారము మంచినీళ్లు అందిస్తున్నాం.ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు.వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి.చీకటి పడడం తో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు లోకి ఎవరినీ వెళ్లకుండా పోలీసులతో అటవీ శాఖ అధికారులతో చర్యలు చేపట్టాం..

-మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్

Exit mobile version