కరోనా మహమ్మారి ఎప్పుడు.. ఎవరిని.. ఎలా బలితీసుకుంటుందో తెలియడం లేదు.
విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యాలయంలో తను కూర్చున్న కుర్చీలోనే తుదిశ్వాస విడిచారు.
ఈ హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వళ్తే.. జిల్లాలోని గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా జయశంకర్ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు.
గత నాలుగు రోజులుగా జయశంకర్ జ్వరంతో బాధపడుతున్నారు. అయితే తను కొవిడ్ లక్షణాలతో బాధపడుతూ మృతి చెంది ఉంటారని భావించిన సిబ్బంది ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.