Site icon vidhaatha

ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి..

రాప్తాడు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి రాజకీయాలు చేయాలని ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని TDP, వైస్సార్సీపీ నాయకులకు RPS విజ్ఞప్తి.

రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే అనంతపురం జిల్లా అనే నానుడి ఉంది. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, పిల్లల భవిష్యత్ గురించి అలోచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజల మనోభావాలను గుర్తించి వారికి అండగా నిలవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ఇరు పార్టీ ల యువ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎందుకంటే గత చరిత్ర అంతా ప్రజల కు తెలుసు కాబట్టి ఆ గడ్డు రోజుల ను మరచి అనేక మంది వారి పిల్లలకు మంచి విద్యను అందించేందుకు పట్టణాలకు వలస రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితి లేకుండా ప్రతి మండలం లోను మీకు ఉన్న అధికారం ను ఉపయోగించి మంచి స్కూళ్లు, కాలేజ్ లు,చదువు కొన్న యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మంచి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి తాగు నీరు, సాగు నీరు అందించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటన లలో అనేక కుటుంబాలు నష్టపోయిన విషయం గుర్తు చేసుకోవాలని,పరిటాల రవీంద్ర లాంటి వ్యక్తి ఇలాంటి ఫ్యాక్షన్ జిల్లాలో ఉండకూడదు అని ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేయాలని తపన అయన మాటల ద్వారా తెలిసేది.

ఇప్పుడు ఆయన వారసుడు పరిటాల శ్రీరామ్ కూడా ఫ్యాక్షన్ రహిత సమాజం కోసం పని చేయాలని, అందుకు అధికార పార్టీ MLA మిత్రులు ప్రకాశ్ రెడ్డి కూడా సహకారాన్ని అందించాలని ,ఒకరినొకరు రెచ్చ గొట్టే మాటలు కాకుండా ,నియోజకవర్గ అభివృద్ధి కి మంచి సలహాలు సూచనలు ఇచ్చుకునే సంప్రదాయం కు ఇద్దరు యువ నాయకులు ముందుకు రావాలని, అందుకు పోలీసులు కూడా సహకారాన్ని అందించాలని జిల్లా SP గారిని కూడా కోరడం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు ఒక DSP ని నియమించాలని ముఖ్యమంత్రి గారికి విన్నపం.

ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అనేక సంఘటన లలో పెద్ద ఎత్తున నష్టపోయిన కుటుంబాలు బలహీన వర్గాలు అనే విషయం కూడా నాయకులు గుర్తు ఉంచుకోవడం మంచిది అని ఇరు వర్గానికి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ,ఆదుకోవాలని ఇరువురి నేతలకు RPS విజ్ఞప్తి చేస్తున్నది.

Exit mobile version