Site icon vidhaatha

బ్లాంక్‌,రహస్య జీవోల పై గవర్నర్‌ కు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు

విధాత:అమరావతి: జగన్‌ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. బ్లాంక్‌, రహస్య జీవోల వ్వవహారంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడారు. ‘‘ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేస్తే మాకేంటన్న రీతిలో వైకాపా ప్రభుత్వం ఉంది. అన్నీ బ్లాంక్‌ జీవోలే.. 12రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారు. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారు. బ్లాంక్‌ జీవోలు చూసి గవర్నర్‌ ఆశ్చర్యపోయారు’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Exit mobile version