విధాత:ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంత్ర హాజరైనారు.సుమారు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై చర్చిస్తారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి.కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.