Site icon vidhaatha

కేఆర్‌ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదు: సజ్జల

విధాత,విజయవాడ: జల వివాదం విషయంలో కేఆర్‌ఎంబీ చెప్పినా తెలంగాణ వినడం లేదని అందుకే సీఎం వైఎస్ జగన్ లేఖ రాయాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం జగన్ సహకరించారని గుర్తు చేశారు.

గతంలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రాయలసీమ ప్రయోజనాలు అవసరమని కేసీఆరే అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎందుకు పరిస్థితులు మారాయో అర్ధంకావడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, దీనివల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version