అఫిడవిట్ ఆస్తుల్లో తెలుగు ఎంపీ నంబర్ వన్

పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో వందలు.. వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోటీలో ఉన్న పలువురు సంపన్నులు తమ ఎన్నికల అఫిడవిట్లలో తమకున్న ఆస్తులను అధికారికంగా ప్రకటిస్తూ

  • Publish Date - April 22, 2024 / 07:59 PM IST

విధాత : పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో వందలు.. వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోటీలో ఉన్న పలువురు సంపన్నులు తమ ఎన్నికల అఫిడవిట్లలో తమకున్న ఆస్తులను అధికారికంగా ప్రకటిస్తూ వామ్మో ఇన్ని ఆస్తులా అనిపించేలా చేస్తున్నారు. ఏడు విడుతల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో విడత నామినేషన్ల ఘట్టం సాగుతున్న వేళలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు ప్రకటించిన ఎన్నికల తమ అఫీడవిట్ ఆస్తుల్లో తెలుగు ఎంపీ అభ్యర్థి నెంబర్ వన్ గా నిలవడం చర్చనీ అంశమైంది. గుంటూరు నుంచి టిడిపి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ తన అఫిడవిట్లో తన కుటుంబానికి. 5785 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో స్థిరాస్తుల విలువ 5598.65 కోట్లు ఉన్నట్లు.. అప్పులు 1038 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. చంద్రశేఖర్ అమెరికాలో వైద్యుడిగా కొనసాగడంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ధనవంతుల ఎంపీల జాబితాలో కర్ణాటకలోని మాండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ్ 622కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచా.రు తర్వాత స్థానాలలో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ 593 కోట్లు, యూపీలోని మధురా నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమమాలిని 278 కోట్లతో ఉన్నట్లు ఏ డి ఆర్ పేర్కొంది.

Latest News