జిల్లాలో రొజు రోజుకూ కోవిడ్ బాధితుల సంఖ్య మరింత గా పెరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో చేపట్టిన పనులు కూడా చేయలేదు.
ముఖ్యంగా మెదటి విడత కరోన నివారణకు జిల్లాలో కలెక్టర్ గారు రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని గోడవన్ లలో దాదాపు 2 కోట్ల రూపాయలు పైన ఖర్చు చేసి 15 వందల పడకలు,వాటికి సరిపడ ఆక్సిజన్ ,వెంటిలేటర్ ల సౌకర్యం కల్పించడం జరిగింది అని పత్రికలలో కూడా వార్తలు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆ బెడ్స్ ను ఎందుకు కరోన రోగులకు వైద్యం అందించడానికి ఉపయోగించడము లేదు, ఇంతా డబ్బులు ఖర్చు చేసి వాటిని ఎందుకు కలెక్టర్ గారు ఉపయోగము లోకి తీసుకుని రావడం లేదు.
జిల్లాలో ఉన్న ఒకేఒక ప్రధాన ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కరోన సేవలకు ఉపయోగిస్తే మిగతా రోగాలు వచ్చిన ప్రజలు ఎక్కడ వైద్యం పొందాలి.
మరి అక్కడ అంత హడావుడి గా పనులు ప్రారంభం చేసి ఇప్పుడు ఇంతా ఇబ్బందులు పడుతున్నారు ఇది అధికారుల వైఫల్యం కాదా.ఇంత జరుగుతున్నా జిల్లాలో ఉన్న మంత్రి, MLA, MLC, MP లు ఏమి చేస్తున్నారు. ఇది ప్రజల సొమ్ము కాదా .మరి ప్రజల సొమ్మును ప్రజల కు కష్టాలు వచ్చినపుడు సక్రమంగా ఉపయోగించ నపుడు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ వెంటనే గతంలో చేపట్టిన పనులు ప్రజలకు కరోన బారి నుండి కాపాడు కోవడానికి వాడుకోవచ్చు అని, జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విధాలా రోగాల కు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోన రోగులకు వైద్యం కోసం అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు వీటిపై కలెక్టర్ గారు దృష్టి పెట్టాలని, ప్రతి మండలం లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోన పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వాసు,జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.