Site icon vidhaatha

రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం, పిచ్చి తుగ్లక్ నిర్ణయం.

డా.ఎన్. తులసి రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు,ఎపిసిసి.కామెంట్స్

విధాత:రాజధాని భూముల క్రయ విక్రయాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి.వైకాపా ప్రభుత్వం యువతను నమ్మించి మోసగించడం శోచనీయం. దాదాపు 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. కంటి తుడుపు చర్యగా కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యడం అన్యాయం.

మిగిలిన ఖాళీ ఉద్యోగాల భర్తీకి అదనపు జాబ్ క్యాలెండరు విడుదల చెయ్యాలి.వివిధ కార్పొరేషన్ల ధ్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పధకాలు అమలు చెయ్యాలి.ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తేవాలి.పరిశ్రమలు రావాలంటే JCB, ACB, PCB కల్చర్ పోవాలి.నెలకు రూ. 2000/- లు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.కాపు నేస్తం పధకం రాయలసీమ పేద కాపు మహిళలకు వర్తించక పోవడం అన్యాయం, విరుద్ధం.రాయలసీమలో పుట్టడం తప్పా? కాపు కులంలో పుట్టడం తప్పా? మహిళలుగా పుట్టడం తప్పా? పేదలుగా పుట్టడం తప్పా?

Exit mobile version