ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశంలో ఏపీ హోం శాఖ కార్యదర్శి డిజిపి కి మరోసారి సమన్లు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ.ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సమన్లు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ.
ఎంపీ రఘురామ అరెస్ట్ వ్యవహారంపై నివేదిక పంపాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం.నివేదిక ఎందుకు జాప్యం అవుతుందోనని ఏపీ అధికారులను నిలదీసిన ఎన్హెచ్ఆర్సీ.
ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజాగా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు
గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశం.దీనికి సంబంధించి ఏపీ హోం శాఖ కార్యదర్శి డీజీపీ ని హెచ్చరించిన ఎన్హెచ్ఆర్సీ.