ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి కామెంట్స్
విధాత:రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది.వైకాపా అధికారంలోకి వచ్చి జగన్ సిఎం అయితే రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది.రెండేళ్ల జగన్ పాలనలో ప్రత్యర్ధులపై దాడులు పెరిగిపోయాయి .మాజీ మంత్రి దేవినేని ఉమా పై వైకాపా శ్రేణులు దాడి చేస్తే ఆయనపైనే కేసు పెట్టడం మరీ దుర్మార్గం.దాడి చేసింది వైకాపా ఎస్సి,ఎస్టి యాక్ట్ కట్టింది దేవినేని ఉమాపైన,రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది…ఆంగ్లేయుల పాలనలో ఇన్ని ఘోరాలు చూడలేదు.సిఎం సొంత జిల్లాలోనే చాలామంది హత్య గావించబడ్డారు.ముఖ్యమంత్రి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ చేసి పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.జగనన్న విద్యా దీవెన పాత పధకమే..2007 లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ద్వారా పథకం అమలయ్యేది.జగనన్న విద్యాదీవెన పధకం కాదు జగనన్న విద్యా దీవెన శాపం లామారింది.జీవో నెంబర్ 77 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.