విధాత :విశాల దృష్టి తో వీక్షించి, భారతదేశానికి దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అందించిన సేవలను భారత జాతి యావత్ చిరకాలం గుర్తు పెట్టుకోగలదంటూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు.పి వి శతజయంతి సందర్భంగా విశాఖ పర్యటనలో ఉన్న నాయుడు సోమవారం పి.వి.నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, క్రాంతి దర్శి, విప్లవాత్మక, ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శి అంటూ నివాళులర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పి వి స్వావలంబన, స్వయం సమృద్ధి కి పెద్ద పీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు వేశారు అంటూ కొనియాడారు.