Site icon vidhaatha

త్వరలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు టీకా

విధాత:రాష్ట్రంలో 18 నుంచి 44 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు టీకాలు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరిలో ఆరు లక్షల మంది విద్యార్థులు, ఏడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది.గత శనివారం ఏడు లక్షల డోసుల టీకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. వీటి పంపిణీ పూర్తి కావొచ్చింది.ఈనెల15 తర్వాత వచ్చే డోసులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తారు.

Exit mobile version