Site icon vidhaatha

సోమవారం నుంచి ఆలయ ఉద్యోగులందరికీ టీకాలు

దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, ఛైర్ పర్సన్ సంచయిత గజపతి, ఈఓ సూర్యకళగారు నిర్ణయించడమైనది.

రోజుకు 150 నుంచి 200 మంది ఉద్యోగుల చొప్పున సోమవారం నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఉద్యోగులందరికీ నాలుగైదు రోజుల్లో తొలి విడత వ్యాక్సినేషన్ పూర్తికానుంది. ఉద్యోగులందరూ వ్యాక్సినేషన్ చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని సంచయిత గజపతి గారు కోరారు. దీంతోపాటు కోవిడ్ ప్రొటోకాల్ ను పూర్తిస్థాయిలో పాటించాలని … భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవాలన్నారు.

Exit mobile version