Site icon vidhaatha

సెప్టెంబర్ 11న మరోసారి లోక్ అదాలత్ ప్రారంభిస్తాం..రత్నకుమార్

విధాత:గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20 నుండి 25 బెంచ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.కోర్టుకు హాజరుకాలేని పరిస్థితుల్లో డిజిటల్ మరియు వర్చువల్ విధానం ద్వారా సంప్రదించే అవకాశం.గత లోక్ అదాలత్ లో 2266 కేసులను పరిష్కరించాం… ఈసారి అంతకన్నా ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాం.సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సమస్యలు, స్థలాల సమస్యల వంటి కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నం.రెండు లక్షల లోపు చెక్ బౌన్స్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.ఒక్కసారి లోక్ అదాలత్ లో సమస్య పరిష్కారం అయితే అదే తుది తీర్పుగా పరిగణించబడుతుంది.ఎవ్వరూ ఓడినట్లు కాదు.గుంటూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకొని తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలి.

Exit mobile version