Site icon vidhaatha

వైఎస్ జగన్ నివాసం ముట్టడి.. అడ్డుకున్న పోలీసులు

విధాత,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాసం ముట్టడికి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఔటసోర్స్ ఎంప్లాయిస్ యూనియన్‌ పూనుకుంది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు మార్గ మధ్యలోనే వారిని అడ్డుకున్నారు.పోలీసులు తీరుపట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్‌ల ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో టెస్ట్‌లు చేసామని… తాము కూడా పాజిటివ్ అయ్యామని తెలిపారు. మొత్తం 5000 వేళా మంది ఉద్యోగుల భవిషత్తును నాశనం చెయ్యొద్దని అన్నారు. తమను ఔట్ సోర్స్‌లో తీసుకున్న అపోలో యాజమాన్యం టెర్మినషన్ ఆర్డర్ ఇచ్చారని… ఇది న్యాయమా అని ముఖ్యమంత్రిని అడిగేందుకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version