Site icon vidhaatha

దేశంలో బీజేపీ రాజ్యంగం నడుస్తుంది.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌.షర్మిల ధ్వజం

విధాత : మన దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదని, బీజేపీ రాజ్యంగం నడుస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌.షర్మిల ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ప్రతిపక్ష పార్టీలపై ఉపయోగించి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదని, ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నదే బీజేపీ సర్కార్ కుట్ర అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పై బీజేపీ అప్రజాస్వామిక దాడులను నిరసిస్తూ తాము విజయవాడ ఐటీ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు-జనసేన కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ ఒక్క మేలు చేయకపోయినా అదానీ, అంబానీల అనుచరులకు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ మాజీ చీఫ్ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version