ఇప్పుడు ఓటీటీ యుగం నడుస్తుంది. థియేటర్స్‌లో సందడి చేసే సినిమాల కన్నా ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కి డిమాండ్ ఎక్కువ ఉంది. వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ షోలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్‌ని ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరి నవంబర్ నాలుగో వారంలో ఓటీటీలో ఏయే సినిమాలు సందడి చేయబోతున్నాయి, ప్రస్తుతం ఓటీటీలో ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం. సోనీలివ్ లో చావర్ (మలయాళం): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లో స్టాంపెడ్ ఫ్రమ్ ది బిగినింగ్ (హాలీవుడ్): నవంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (వెబ్‌సిరీస్): నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. పులిమడ (తెలుగు సహా 5 భాషల్లో): నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మై డెమన్ (కొరియన్): నవంబర్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే డాల్ బాయ్ (హాలీవుడ్): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. గ్రాన్ టురిస్మో (తెలుగు డబ్బింగ్): నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక డిస్నీ+హాట్‌స్టార్ లో ఫార్గో (వెబ్‌సిరీస్): నవంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ లో ది విలేజ్ (వెబ్‌సిరీస్): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. బుక్ మై షో లో ఒప్పైన్ హైమర్ (హాలీవుడ్): నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆపియల్ టీవీ ప్లస్ : హన్నా వాడ్డింగ్‌హమ్ (హాలీవుడ్): నవంబరు 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇలా ప్రతి వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌మైన్ అందుబాటులో ఉంటుంది. థియేటర్ విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ నవంబర్ 24న విడుదల కానుంది. ధృవ నక్షత్రం (తెలుగు డబ్) నవంబర్ 24, కోటబొమ్మాళి నవంబర్ 24, సౌండ్ పార్టీ నవంబర్ 24న థియేటర్స్‌లో సందడి చేయనుంది.