ప్రతివారం ప్రేక్షకులకి ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కుతుంది. వైవిధ్యమైన సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు మస్త్ మజా పంచుతున్నాయి. డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులని అలరించనున్నాయనేది చూస్తే.. ముందుగా మలయాళ సినిమా ‘ఫ్యామిలీ’ డిసెంబర్ 15వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్ హీరోగా నటించారు. ఇక ది ఫ్రీలాన్సెర్: ది కన్‍క్లూజన్ – వెబ్ సిరీస్ – డిసెంబర్ 15 – డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా, డ్యాన్స్ ప్లస్ ప్రో- రియాలిటీ షో – డిసెంబర్ 11 మొదలు – డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.
ఇక ఆహాలో చూస్తే.. అభయ్ నవీన్, అన్వేష్ మైకేల్ ప్రధాన పాత్రలు పోషించిన తెలుగు మూవీ ‘రాక్షస కావ్యం’ డిసెంబర్ 15న ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రానికి శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించారు. ఇక నెట్‍ఫ్లిక్స్ లో తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన జపాన్ సినిమా డిసెంబర్ 11 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇందులో కార్తీ దొంగగా నటించి అలరించారు. రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. థియేటర్‌లో ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. ఇక ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 2 – వెబ్ సిరీస్ – డిసెంబర్ 14 – నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా, ఏస్ ది క్రౌ ఫైల్స్ సీజన్ 2 – వెబ్ సిరీస్ – డిసెంబర్ 14 – నెట్‍ఫ్లిక్స్, కారోల్ & ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ – వెబ్ సిరీస్ – డిసెంబర్ 15 – నెట్‍ఫ్లిక్స్ లో, పేస్ టు ఫేస్ వీత్ ఈటీఏ – డాక్యుమెంటరీ – డిసెంబర్ 15 – నెట్‍ఫ్లిక్స్ లో, సింగిల్స్ ఇన్‍ఫెర్నో సీజన్ 3 – సిరీస్ – డిసెంబర్ 12 – నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో డెత్స్ గేమ్ – వెబ్ సిరీస్ – డిసెంబర్ 15 – అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండగా, రీచర్ సీజన్ 2 – వెబ్ సిరీస్ – డిసెంబర్ 15 – అమెజాన్ ప్రైమ్ వీడియో, సిల్వర్ & ది బుక్ ఆఫ్ డ్రీమ్స్ – సినిమా – డిసెంబర్ 15 – అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమింగ్ కానుంది. అలానే ఈటీవీ విన్‍లో మంచు మనోజ్ హోస్ట్ చేయనున్న ‘ఉస్తాద్’ గేమ్ షో డిసెంబర్ 15న మొదలుకానుంది. తొలి ఎపిసోడ్‍కు గెస్టుగా నేచురల్ స్టార్ నాని వచ్చి సందడి చేయనున్నాడు. ఇక కుసే ముణిస్వామి వీరప్పన్ – డాక్యు సిరీస్ – జీ5 – డిసెంబర్ 14నుండి స్ట్రీమింగ్ కానుండగా, ది బ్లాకెనింగ్ – సినిమా – జియో సినిమా – డిసెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది.